america: ఉత్తరకొరియాతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి: అమెరికా
- ఉత్తరకొరియాతో యుద్ధ పరిస్థితులు తలెత్తేలా ఉన్నాయి
- ఆ దేశంతో అమెరికా యుద్ధానికి దగ్గరవుతోంది
- దౌత్యపరంగా పరిష్కరించే అవకాశం ఉందని అనుకోవడం లేదు
- -యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్
ఎన్నడూ లేని విధంగా ఉత్తరకొరియాతో తమ దేశం యుద్ధానికి దగ్గరవుతోందని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదని తెలిపారు.
తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఎవరిమాటా వినకుండా ఉత్తరకొరియా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా ఇప్పటికే సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే.