teja: ఎన్టీ రామారావు ఉపయోగించిన 'గద'ను వాడుతోన్న బాలకృష్ణ!

  • ఎన్టీ రామారావు బయోపిక్ టీజర్ షూటింగ్ 
  • టీజర్లో సుయోధనుడిగా కనిపించనున్న బాలకృష్ణ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి  

ఎన్టీ రామారావు ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించారు .. ఏ పాత్రను పోషించినా ఆ పాత్రలో ఒదిగిపోయారు. అలా ఆయన పోషించిన చెప్పుకోదగిన పౌరాణిక పాత్రల్లో 'దానవీరశూరకర్ణ'లోని సుయోధనుడి పాత్ర ఒకటి. ఈ పాత్రలో ఆయన ధరించిన 'గద' కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అప్పటి నుంచి రామకృష్ణ స్టూడియోస్ లో అపురూపంగా జాగ్రత్త చేయబడిన ఆ 'గద'ను, మళ్లీ ఇన్నాళ్లకు బాలకృష్ణ వాడుతుండటం విశేషం.

 ఎన్టీ రామారావు బయోపిక్ కోసం దర్శకుడు తేజ .. బాలకృష్ణతో టీజర్ ను షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ షూటింగ్ కోసం బాలకృష్ణ ఈ 'గద'తో షూటింగులో పాల్గొంటున్నారట. సుయోధనుడి గెటప్ లో బాలకృష్ణను చూడటానికి ఆయన అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఎన్టీ రామారావు బాల్యం .. విద్యాభ్యాసం .. సినిమాల్లోకి ఎంట్రీ .. తిరుగులేని నటుడిగా ఎదగడం .. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకూ ఈ బయోపిక్ లో చూపిస్తారట.       

  • Loading...

More Telugu News