2018 Elections: ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మోదీ ముందు సవాలే!

  • 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ ప్రణాళికలు
  • 8 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు
  • కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యం

2014లో తనకు దక్కిన అధికారాన్ని మరో ఐదేళ్లు కొనసాగించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కొత్త సంవత్సరం సవాళ్ల స్వాగతాన్ని పలికింది. వచ్చే సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు ఉండగా, అంతకన్నా ముందు ఈ ఏడాది డిసెంబర్ లోగా 8 రాష్ట్రాల్లో ఆయన ఎన్నికలను ఎదుర్కోవాల్సి వుంది. ఈ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మొత్తం 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండగా, వీటిల్లో నాలుగు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు కీలకమైనవి. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్నది మోదీ ప్లాన్. వీటితో పాటు నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీకి కాంగ్రెస్ తో నే ప్రధాన పోటీ. ఆ తరువాత, అంటే 2019లో సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News