Kate Winslet: హార్వీ వెయిన్ స్టీన్ లైంగిక హింసపై తొలిసారి స్పందించిన కేట్ విన్ స్లెట్!

  • హార్వీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
  • తాజాగా స్పందించిన కేట్ విన్ స్లెట్
  • అతనికి అంత సీన్ ఇవ్వలేదన్న కేట్

హార్వీ వెయిన్ స్టీన్... ఇటీవలి కాలంలో ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు లైంగిక ఆరోపణలు చేసిన నిర్మాత. తన చర్యలతో పలువురిని వేధించిన హార్వీ లక్ష్యంగా 'మీ టూ' అనే హ్యాష్ ట్యాగ్ మొదలవగానే, ఆయన చేతిలో వేధింపులకు గురైన పలువురు సెలబ్రిటీలు గొంతు విప్పారు. ఇక తాజాగా 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్ స్లెట్ కూడా తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పింది.

'టైటానిక్' వచ్చిన చానాళ్ల తరువాత, 2009లో కేట్, 'ది రీడర్' అనే సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది. ఆ సమయంలో హార్వీ గురించి వేదికపై మాట్లాడాలని ఒత్తిడి వచ్చిందట. కేట్ మాత్రం ససేమిరా అని ఒక్క ముక్క కూడా హార్వీ గురించి చెప్పలేదట. ఇక, ఇప్పుడు హార్వీ గురించి ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, కేట్ స్పందిస్తూ, అటువంటి వాడిని భరించడం చాలా కష్టమని తేల్చింది.

తన తొలి సినిమా 'హెవెన్లీ క్రియేచర్స్'కు హార్వీ కూడా ఓ నిర్మాతని గుర్తు చేస్తూ, ఆపై ఎప్పుడు కలిసినా, తనకు తొలి అవకాశాన్ని నేనే ఇచ్చానని హార్వీ అంటుండేవాడని, తాను మూడుసార్లు ఆడిషన్ కు వెళ్లి సెలక్ట్ అయితే, అతను నాకు అవకాశం ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తాను ఎప్పుడు కలిసినా చాలా కటువుగా మాట్లాడేవాడని, అందువల్లే ఆస్కార్ వేడుకల్లో అతని గురించి చెప్పాల్సినంత సీన్ ఉందని అనుకోలేదని చెప్పుకొచ్చింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News