Sircilla: సిరిసిల్ల కలెక్టర్ ట్విట్టర్ రికార్డు.. రెండో స్థానంలో ఆమ్రపాలి

  • రాష్ట్రంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన కలెక్టర్‌గా రికార్డు
  • ప్రజా సమస్యల కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ ఖాతా
  • రెండో స్థానంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి

తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్ ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఆయన ట్విట్టర్ ఖాతాకు ఇప్పటివరకు 2,016 మంది ఫాలోవర్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఉన్నారు. కృష్ణభాస్కర్ ఇప్పటి వరకు 1,301 పోస్టులు చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో ఫాలోవర్లు ఉన్న కలెక్టర్ కృష్ణభాస్కరే. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘కాల్ రాజన్నసిరిసిల్ల’ పేరుతో ఖాతా తెరిచారు. ఈ ఖాతా ద్వారా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారు.  

తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న కృష్ణభాస్కర్ అనతికాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవల ఓ యువకుడు స్థానిక బస్టాండ్‌లో అపరిశుభ్రతపై ట్వీట్ చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించారు. అప్పట్లో ఇది జిల్లాలో హాట్ టాపిక్ అయింది. 

Sircilla
Telangana
District Collector
Krishna Bhaskar
  • Loading...

More Telugu News