padmavati: ‘పద్మావతి’లో సన్నివేశాలు తొలగించమని చెప్పలేదు: సీబీఎఫ్ సీ సభ్యుడు
- ‘పద్మావతి’పై వస్తున్న వదంతులపై మండిపడ్డ వాణి త్రిపాఠి టిక్కో
- కొన్ని సన్నివేశాలను సవరించమని మాత్రమే చెప్పాం
- టైటిల్ ని ‘పద్మావత్’ గా మార్చమన్నాం .. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చాం
‘పద్మావతి’ సినిమాలోని మొత్తం 26 సన్నివేశాలను కట్ చేయాలని కేంద్ర సెన్సార్ బోర్డు సూచించినట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ విషయమై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) సభ్యుడు వాణి త్రిపాఠి టిక్కో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన స్పందిస్తూ, సినిమాలో కొన్ని సన్నివేశాలను సవరించమని మాత్రమే దర్శక, నిర్మాతలకు సూచించామని చెప్పారు. ఈ చిత్రం టైటిల్ ను ‘పద్మావత్’ గా మార్చమని సూచిస్తూ, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిపారు.
కాగా, ‘పద్మావతి’ చిత్ర వివాదానికి సంబంధించి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ తో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. 16వ శతాబ్దానికి చెందిన మాలిక్ మహమ్మద్ రాసిన ‘పద్మావత్’ కవిత ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించానని, ఈ చిత్ర నిర్మాణానికి రూ.150 కోట్ల వ్యయం చేసినట్టు ప్యానెల్ తో భన్సాలీ పేర్కొన్నారు.