flipkart: ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్... జనవరి 3 నుంచి ఆరంభం

  • 3 నుంచి 5 వరకు తగ్గింపు ధరలకు అమ్మకాలు
  • షియోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ పై ఆఫర్లు
  • నో కాస్ట్ ఈఎంఐ, బైబ్యాక్ ఆఫర్లు

2018లో నూతన మొబైల్స్ ను సొంతం చేసుకోవాలనే ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా షియోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2ఎక్స్ఎల్, మోటో జి5 ప్లస్, రెడ్ మీ నోట్ 4, లెనోవో కె5 నోట్, శ్యామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 7 స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లున్నాయి.

నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ రహిత కొనుగోలు రుణం), తిరిగి కచ్చితంగా కొనుగోలు చేసే బైబ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. షియోమి ఎంఐ ఏ1 ధర రూ.13,999 కాగా, డిస్కౌంట్ సేల్ లో దీన్ని రూ.12,999కే అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ మోడళ్లపై రూ.8,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు ఈఎంఐపై ఇది లభిస్తుంది. ఇంకా చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి.

flipkart
mobiles
discount sale
  • Loading...

More Telugu News