Rajinikanth: రజనీకి శుభాకాంక్షలు తెలిపిన అమితాబ్, ఖుష్బూ, పలువురు సినీ ప్రముఖులు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8f8465af192cdf8c83e31f1c300409d7afe6b853.jpg)
- రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నానన్న బిగ్ బీ
- ప్రజాస్వామ్యంపై రజనీకి నమ్మకం ఉందన్న ఖుష్బూ
- తమిళ ప్రజలు రజనీ వెంటే అన్న లింగుస్వామి
'దళపతి' రజనీకాంత్ యుద్ధరంగంలోకి దిగారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు నేడు స్పష్టం చేశారు. పొలిటికల్ ఎంట్రీ ప్రకటన తర్వాత రజనీపై పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. 'రజనీ అద్భుతమైన వ్యక్తి. నా సహచర నటుడు, ఆప్తుడు అయిన రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. రాజకీయాల్లో అతను రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.
ప్రముఖ నటి ఖుష్బూ స్పందిస్తూ, ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై రజనీకి నమ్మకం ఉందనే విషయం మనందరికీ తెలుసని... రాజకీయాల్లో ఆయన రాణించాలని అభిలషించారు.
సినీ రంగంలో మాదిరిగా రాజకీయాల్లో కూడా మీరు అద్భుతంగా ఎదగాలంటూ దర్శకుడు ప్రసన్న అన్నారు. తమిళ ప్రజలకు సేవ చేసే కొత్త నేతగా అవతరించాలని కోరారు.
తమిళ ప్రజలు రజనీ వెంటే ఉంటారని... రాజకీయాల్లో కూడా ఆయనకు తిరుగులేదని దర్శకుడు లింగుస్వామి అన్నారు.