sambasiva rao: సాంబశివరావు నుంచి ఐదు సార్లు బాధ్యతలు స్వీకరించా: డీజీపీ మాలకొండయ్య

  • సాంబశివరావు నాకు అన్నలాంటి వారు
  • ఇద్దరం ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నాం
  • ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటా

ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. మాజీ డీజీపీ సాంబశివరావు వీడ్కోలు కార్యక్రమంలో మాలకొండయ్య మాట్లాడుతూ, సాంబశివరావు తనకు అన్నయ్యలాంటి వారని చెప్పారు. తన కెరీర్లో సాంబశివరావు నుంచి తాను ఐదుసార్లు బాధ్యతలను స్వీకరించానని తెలిపారు. తామిద్దరం ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పారు. సాంబశివరావు ఆయురారోగ్యాలతో విశ్రాంత జీవితాన్ని సంపూర్ణంగా గడపాలని కోరుకుంటున్నానని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని తెలిపారు.

sambasiva rao
malakondaiah
  • Loading...

More Telugu News