Rajinikanth: బీజేపీకి షాకిచ్చిన రజనీ.. దేశ రాజకీయాలు నాశనమయ్యాయంటూ విమర్శ!

  • బీజేపీ, కాంగ్రెస్ లపై పరోక్ష విమర్శలు
  • రాజకీయ నేతలు దోపిడీకి తెగబడుతున్నారు
  • ఆధ్యాత్మిక పాలన అందిస్తా

తమిళనాట పాగా వేసేందుకు, సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆయన షాక్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్... ఢిల్లీ రాజకీయాలపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాలు నాశనమయ్యాయంటూ పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్ లపై ఆయన ధ్వజమెత్తారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు.

రాజులు దండయాత్ర చేసి దోచుకుంటున్నట్టు... ప్రస్తుత రాజకీయ నేతలు దోపిడీకి తెగబడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక పాలన అందిస్తానని చెప్పారు. పార్టీ ఏర్పాటులో అభిమాన సంఘాలదే కీలక పాత్ర అని చెప్పారు.

Rajinikanth
rajinikanth political entry
  • Loading...

More Telugu News