muslim: ట్రిపుల్ తలాక్ తర్వాత.. మరో డిమాండ్‌ను మోదీ ముందుంచిన ముస్లిం మహిళలు!
- మరో సంస్కరణ చేయాలి
- బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేయాలి
- ట్రిపుల్ తలాక్ కంటే బహుభార్యత్వం వల్ల అధికంగా కష్టాలు
ముస్లిం మహిళల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోన్న ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీని పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమకు సంబంధించి మరో సంస్కరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ట్రిపుల్ తలాక్‌తో పాటు బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేయాలని, ట్రిపుల్ తలాక్ కంటే బహుభార్యత్వం వల్ల అధికంగా కష్టాలు ఎదుర్కుంటున్నామని పలువురు ముస్లిం మహిళా న్యాయవాదులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై కూడా చొరవ తీసుకోవాలని వారు మీడియాతో అన్నారు.