fathima college: ఆర్డినెన్సు అమలయ్యే విధంగా కృషి చేస్తా: 'ఫాతిమా' విద్యార్థులకు పవన్ కల్యాణ్ హామీ

- ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య
- ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఏపీ సర్కారు ప్రయత్నాలు
- పవన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఫాతిమా కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
మూడేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నందుకు ఫాతిమా కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ రోజు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. వారు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనను కలిశారని ఆ పార్టీ ప్రెస్‌నోట్ ద్వారా తెలిపింది.
తనను కలసిన వారితో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. న్యాయం తప్పక విజయం సాధిస్తుందని అన్నారని, విద్యార్థుల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్సు అమలయ్యే విధంగా కృషి చేస్తానని పవన్ చెప్పారని తెలిపింది.
