shiva karthikeyan: సినిమా హిట్టయినా.. స్నేహ చాలా ఫీలైందట!

  • 'వేలైక్కారన్'కి హిట్ టాక్ 
  • ముఖ్యమైన పాత్ర చేసిన స్నేహ 
  • పాత్ర నిడివి తగ్గించినందుకు అసంతృప్తి      

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా స్నేహ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ మంచి మార్కులను కొట్టేసింది. అలాంటి స్నేహ ఈ మధ్య తన వయసుకు తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. తాజాగా ఆమె తమిళంలో 'వేలైక్కారన్' సినిమా చేసింది. శివకార్తికేయన్ - నయనతార జంటగా నటించిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.

అలాంటి ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల నిడివి గల పాత్రలో స్నేహ నటించిందట. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో కష్టపడి మరీ బరువు తగ్గింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చింది. థియేటర్ కి వెళ్లి చూసిన స్నేహ షాక్ అయిందట. అందుకు కారణం ఆమె పాత్ర నిడివిని చాలావరకూ తగ్గించడమే. తనకి మంచి పేరు తెస్తుందని కష్టపడి చేసిన సీన్స్ ను .. మాట మాత్రమైనా చెప్పకుండా లేపేస్తారా? అంటూ సన్నిహితుల దగ్గర స్నేహ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా సమాచారం.    

shiva karthikeyan
nayanatara
  • Loading...

More Telugu News