katrina kaif: రణబీర్ ను ఇటీవలే కలిశా: కత్రినా కైఫ్

  • ఒకరికొకరం మ్యాచ్ కాదు
  • స్నేహపూర్వకంగానే విడిపోయాం
  • ప్రేమలు విఫలమయినందుకు ఎప్పుడూ బాధపడలేదు

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నటి కత్రినా కైఫ్ లు గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమాయణం దాదాపు పెళ్లి వరకు కూడా వెళ్లింది. కొన్ని పరిణామాల నేపథ్యంలో, ఆ తర్వాత వీరిద్దరూ దూరమయ్యారు. ఈ విషయంపై తాజాగా కత్రిన మాట్లాడుతూ, ఇద్దరం స్నేహపూర్వకంగానే విడిపోయామని చెప్పింది. తమ మధ్య ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేంత శత్రుత్వం లేదని తెలిపింది.

ఒకరికొకరు మ్యాచ్ కాదనే విషయం ఇద్దరికీ అనిపించిందని... అందుకే బ్రేకప్ అయ్యామని చెప్పింది. బ్రేకప్ అయిన తర్వాత కూడా స్నేహితుల్లాగానే ఉండాలని అనుకున్నామని తెలిపింది. ఆ తర్వాత సినిమాలతో ఇద్దరం బిజీ అయిపోయామని.. అందుకే మాట్లాడుకోవడం కుదరలేదని చెప్పింది. ఇటీవలే ఓ సందర్భంలో కలుసుకుని, మాట్లాడుకున్నామని చెప్పింది. తన విషయంలో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదని... ప్రేమ, పెళ్లి ఏదైనా సరే సమయం వచ్చినప్పుడు జరుగుతాయని చెప్పింది. ప్రేమలు విఫలమయినందుకు తానెప్పుడూ బాధపడలేదని తెలిపింది. 

katrina kaif
ranbeer kapoor
bollywood
  • Loading...

More Telugu News