sikhar dhawan: టీమిండియాకు ఆదిలోనే సమస్యలు.. తొలి టెస్టుకు దూరమైన ధావన్

  • కాలి గాయం నుంచి కోలుకోని ధావన్
  • తొలి టెస్టుకు దూరం పెట్టిన మేనేజ్ మెంట్
  • కోహ్లీ అసంతృప్తి

దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లిన టీమిండియాకు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. కాలి గాయంతోనే ధావన్ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అయితే, ఈ గాయం నుంచి ధావన్ పూర్తిగా కోలుకోనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ధావన్ ను తొలి టెస్టుకు దూరంగా ఉంచుతున్నట్టు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

జనవరి 5 నుంచి భారత్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు జరగనుంది. కేప్ టౌన్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ధావన్ కాలి గాయం నేపథ్యంలో, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు బరిలోకి దిగనున్నారు. మరోవైపు, టెస్టుకు ధావన్ దూరం కావడం పట్ల కెప్టెన్ కోహ్లీ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. 

sikhar dhawan
south africa tour
Virat Kohli
  • Error fetching data: Network response was not ok

More Telugu News