somireddy chandramohan reddy: వైసీపీ ఎమ్మెల్యేపై మంత్రి సోమిరెడ్డి రూ. 5 కోట్ల పరువునష్టం దావా
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-fb21675b12bc39a448c63c70f014100dc56a91f4.jpg)
- ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు
- విదేశాల్లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయన్న ఎమ్మెల్యే కాకాని
- జిల్లా కోర్టులో పరువు నష్టం దావా వేసిన మంత్రి
వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరువునష్టం దావా వేశారు. విదేశాల్లో సోమిరెడ్డి ఆస్తులను కూడబెట్టారంటూ గతంలో కాకాని డాక్యుమెంట్లు విడుదల చేశారు. పోలీసు విచారణలో కాకాని విడుదల చేసిన డాక్యుమెంట్లు నకిలీవని తేలింది.
దీంతో, కాకానిపై సోమిరెడ్డి రూ. 5 కోట్లకు జిల్లా కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, తన ఆస్తులపై నకిలీ దస్తావేజులు సృష్టించి, తన పరువుకు భంగం కలిగించారని మండిపడ్డారు. సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ లలో తనకు ఆస్తులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.