adhar card: ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం చేస్తామన్న వైద్యులు.. మహిళ మృతి
- మృతురాలు కార్గిల్ యుద్ధంలో అమరుడైన హవల్దార్ లక్ష్మణ్ దాస్ భార్య
- గొంతు కేన్సర్, హృద్రోగ సమస్యలతో బాధ పడుతూ ఆసుపత్రికి
- వాట్సప్ ద్వారా ఆధార్ కార్డును చూపినా వినిపించుకోని వైనం
- హర్యానాలోని సోనిపట్‌లో ఘటన
గొంతు కేన్సర్, హృద్రోగ సమస్యలతో బాధ పడుతోన్న ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఆమెను కుటుంబ సభ్యులు ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్‌ఎస్) హాస్పిటల్‌కు తరలించారు. అయితే, నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం చేస్తామని వైద్యులు తెగేసి చెప్పడంతో ఆమె మృతి చెందింది. హర్యానాలోని సోనిపట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు కార్గిల్ యుద్ధంలో అమరుడైన హవల్దార్ లక్ష్మణ్ దాస్ భార్య శకుంతల దేవీ(55) గా తెలిసింది. ఆమె కుమారుడు వాట్సప్ ద్వారా ఆధార్ కార్డును వైద్యులకి చూపించినప్పటికీ అది చెల్లదని వైద్యులు చెప్పారు. ఒరిజినల్ ఆధార్‌కార్డును మాత్రమే తీసుకురావాలని మొండిగా ప్రవర్తించారు.