rajanikanth: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ప్రకటన చేసిన రజనీకాంత్!

  • రజనీ పొలిటికల్ ఎంట్రీ వాయిదా
  • '2.0' విడుదల ఆలస్యమవుతోంది
  • భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడన్న సూపర్ స్టార్

తన పొలిటికల్ ఎంట్రీని సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి పోస్ట్ పోన్ చేసి, అభిమానులను నిరాశపరిచారు. 31వ తేదీన కీలక ప్రకటన చేస్తానంటూ ఊరించిన సూపర్ స్టార్... చివరకు మళ్లీ మొదటికే వచ్చారు. తన తాజా చిత్రాలు '2.0 ', 'కాలా' విడుదల తర్వాత... తన భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని చెప్పారు. చైన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటపంలో తన అభిమానులతో ఐదో రోజు సమావేశం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

తాను సినీ రంగంలోకి రావడానికి తన మిత్రుడు కారణమని... ఖర్చులకు డబ్బులు కూడా అతనే ఇచ్చాడని ఈ సందర్భంగా రజనీ చెప్పాడు. నిరుపేద స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. తన ఉన్నతికి ఎందరో దర్శకులు కారణమని అన్నారు. తన గురువు బాలచందర్ లేదపోతే రజనీకాంత్ అనేవాడు లేడని చెప్పారు.

కొన్ని కారణాల వల్ల '2.0' సినిమా విడుదల ఆలస్యమవుతోందని తెలిపారు. గతంలో తాను అనారోగ్యానికి గురయ్యానని... అభిమానుల ప్రార్థనల వల్లే కోలుకున్నానని చెప్పారు. తన అభిమానులంతా సంతోషంగా ఉండాలని... మంచి మార్గంలో నడిస్తే, అంతా మంచే జరుగుతుందని అన్నారు. 

rajanikanth
rajani political entry
  • Loading...

More Telugu News