PV Sindhu: సైనా నెహ్వాల్ తో 'హాయ్... బై' మాత్రమే: సింధు కీలక వ్యాఖ్యలు

  • ఆమె నాకు సుదీర్ఘ ప్రత్యర్థి
  • కోర్టులో కాలు పెడితే ప్రత్యర్థులమే
  • ఒకటి రెండు మాటలు తప్ప చర్చలకు సమయం ఉండదన్న సింధు

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, తన సహచరి, సుదీర్ఘ ప్రత్యర్థి సైనా నెహ్వాల్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. తాము వ్యక్తిగతంగా స్నేహితులమే అయినా, కోర్టులో కాలు పెడితే భీకర ప్రత్యర్థులమేనని చెప్పింది. ఇటీవల ఆమె మాట్లాడుతూ, ఒకే చోట శిక్షణ తీసుకున్న సమయంలోనూ తామిద్దరి మధ్యా "హాయ్... బై" అన్న మాటలే ఉండేవి తప్ప, మరేమీ చర్చించుకునే సమయం ఉండేది కాదని చెప్పింది. తాము ఆడుతుంటే గెలవాలని ఇద్దరమూ పోరాడుతామని అంది.

కాగా, మూడేళ్ల పాటు బెంగళూరులో శిక్షణ పొందిన ఆమె, ఇప్పుడు గోపీచంద్ అకాడమీకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ గోపీచంద్ వద్దే శిక్షణ పొందుతున్నారు.  

PV Sindhu
Saina Nehwal
Pullela Gopichand
Badminton
  • Loading...

More Telugu News