jayalalitha: జయలలిత ఒంటిపై దుస్తులు కూడా సరిచేయకుండానే వీడియో తీశారు: నటుడు ఆనందరాజ్ ఫైర్

  • వీడియోలో తేదీ, సమయం కూడా లేవు
  • వీడియో నమ్మశక్యంగా లేదు
  • కోట్లాది మంది అభిమానులు ఆవేదనకు లోనయ్యారు

శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం విడుదల చేసిన దివంగత జయలలిత వీడియోపై తమిళనటుడు ఆనందరాజ్ మండిపడ్డారు. 'అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత' అంటూ ఓ వీడియోను విడుదల చేశారని... ఆ వీడియోలో తేదీ, సమయం ఏదీ లేవని ఆయన అన్నారు. ఈ వీడియో నమ్మశక్యంగా లేదని చెప్పారు. కనీసం జయలలిత ఒంటి మీద దుస్తులను కూడా సరిచేయకుండానే ఈ వీడియోను తీశారని... ఈ వీడియో కారణంగా పార్టీ శ్రేణులు, అమ్మను ఆరాధించే కోట్లాదిమంది ఎంతో ఆవేదనకు గురయ్యారని అన్నారు.

  • Loading...

More Telugu News