Balakrishna: బాలకృష్ణ నాకు తండ్రిలాంటి వారు: నయనతార సంచలన వ్యాఖ్యలు

  • బాలయ్య అంటే ఎంతో గౌరవం
  • రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనిపిస్తుంది
  • సొంత కుటుంబ సభ్యుడిలా ఉంటారు

టాలీవుడ్ లో బాలయ్య, నయనతారలు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన 'సింహా'  సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. పలు సినిమాల్లో వీరిద్దరూ కలసి నటించారు, తాజాగా 'జై సింహా' సినిమాలో వీరిద్దరూ మరోసారి కలసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది.

ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో నయనతార మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలయ్యను తాను తండ్రిలా భావిస్తానని చెప్పింది. ఆయనను చూస్తే గౌరవంతో రెండు చేతులు జోడించి, దణ్ణం పెట్టాలనిపిస్తుందని తెలిపింది. బాలయ్యతో కలసి నటించడమంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పింది. బాలకృష్ణ తనకు ఎప్పుడూ సొంత కుటుంబ సభ్యుడిగానే కనిపిస్తారని తెలిపింది. నయన్ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

Balakrishna
nayanatara
jai simha
  • Loading...

More Telugu News