Reliance: నవంబరులో రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో!
- డౌన్లోడ్ స్పీడ్‌లో జియో ముందంజ
- అప్లోడ్ వేగంలో ఐడియాకు అగ్రస్థానం
- ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్, వొడాఫోన్
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో రికార్డు సృష్టించింది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఆ నెలలో అగ్రస్థానంలో నిలిచింది. టెలికం నియంత్రణ సంస్థ నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో జియో టాప్ ప్లేస్‌కు ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
విచిత్రంగా ఆ నెలలో అప్లోడ్ వేగంలో జియో నాలుగో స్థానానికి పడిపోయింది. 7.1 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగంతో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్టెల్, వొడాఫోన్, జియోలు వరుసగా 3.9, 6.2, 4.9 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
అక్టోబరులో 21.9 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్లోడ్ వేగం నవంబరులో తగ్గిపోగా, ఎయిర్టెల్, వొడాఫోన్లు వృద్ధి సాధించాయి. అక్టోబరులో ఎయిర్టెల్, వొడాఫోన్ డౌన్లోడ్ వేగం వరుసగా 7.5, 8.7 ఎంబీపీఎస్‌గా నమోదు కాగా నవంబరులో 9.3, 9.9గా నమోదైంది.
టెలికం ఆపరేటర్లు ఇటీవల అప్లోడ్, డౌన్లోడ్ వేగాలను క్రమంగా పెంచుతూ పోతున్నప్పటికీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ స్థానం 109 దగ్గర ఆగిపోయింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో ఉంది.