mp gokaraj: భీమవరం యూత్ కల్చరల్ క్లబ్ లో అశ్లీల నృత్యాలు... తిలకించిన ఎంపీ సోదరుడు!

  • క్లబ్ వార్షికోత్సవం సందర్భంగా అశ్లీల నృత్యాలు
  • వార్షికోత్సవంలో నర్సాపూర్ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు
  • ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని యూత్ క్లబ్ లో అశ్లీల నృత్యాలు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం యూత్ కల్చరల్ క్లబ్ 27వ వార్షికోత్సవం సందర్భంగా అశ్లీల నృత్యాలు జరిగినట్టు సమాచారం. ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి తర్వాత అశ్లీల నృత్యాలు నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు నరసింహరాజు, వైసీపీ నేత నరసింహరాజు కూడా హాజరయ్యారు.

సుమారు మూడు గంటలపాటు అశ్లీల నృత్యాలు జరిగాయని, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నుంచి తీసుకువచ్చిన డ్యాన్సర్లతో ఈ నృత్యాలు చేయించినట్టు సమాచారం. క్లబ్ సభ్యులు, వీఐపీలను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని తెలుస్తోంది. అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియోలు తాజాగా బయటపడంతో కలకలం రేపుతోంది. కాగా, ఈ సంఘటనపై ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ స్పందిస్తూ, ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News