barber: హెయిర్ క‌టింగ్ దగ్గర గొడవ.. చెవికి 'కటింగ్' ఇచ్చిన బార్బర్!

  • ఆగ్ర‌హంతో ఊగిపోయిన యువ‌కుడు
  • గొడ‌వ‌ప‌డి క‌త్తితో బార్బ‌ర్ దాడి
  • యువ‌కుడి చెవి భాగం కోసుకుపోయిన వైనం
  • అమెరికాలో విచిత్ర ఘ‌ట‌న‌

క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా ఎంచ‌క్కా త‌యార‌యి సంబ‌రాల్లో మునుగుదామ‌నుకున్న ఓ యువ‌కుడి ఆశ‌ల‌పై ఓ బార్బ‌ర్ నీళ్లు చల్లాడు. అమెరికాలోని మిస్కాన్సన్‌ నగరంలో 46 ఏళ్ల షబానీ ఖలీద్ అనే వ్య‌క్తి క్షుర‌కుడిగా ప‌ని చేసుకుంటున్నాడు. అత‌డి షాపుకి వెళ్లి హెయిర్‌ కటింగ్ చేయమ‌ని చెప్పిన  22 ఏళ్ల ఓ యువ‌కుడు.. లేటెస్ట్‌ ట్రెండ్‌గా ‘2’ ఆకారంలో హెయిర్‌ కటింగ్‌ చేయాలని చెప్పాడు. స‌ద‌రు బార్బ‌ర్ కటింగ్ చేస్తుండ‌గా హాయిగా ఇయ‌ర్ ఫోన్స్‌ పెట్టుకుని పాట‌లు వింటూ క‌ళ్లు మూసుకుని కూర్చున్నాడు. అయితే ఆ బార్బ‌ర్‌ ‘0’ ఆకారంలో హెయిర్‌ కటింగ్‌ చేశాడు.

కటింగ్ చేయ‌డం పూర్త‌య్యాక అద్దంలో చూసుకున్న ఆ యువకుడు త‌న తల వెంట్రుక‌లు చూసుకుని ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. ఇదేంటని నిలదీస్తే, ఆ యువ‌కుడు చెప్పింది వినపడలేద‌ని బార్బ‌ర్ అన్నాడు. జుట్టంతా సగం పోయాక ఇప్పుడు ఏం చేయగలవని ప్ర‌శ్నించాడు. ఆ యువ‌కుడు ఆగ్ర‌హంతో నానా మాట‌లు అనడంతో స‌ద‌రు బార్బ‌ర్ ఓ కత్తి తీసుకుని యువకుడిపై దాడికి దిగాడు. దీంతో ఆ యువ‌కుడి చెవి భాగం కోసుకుపోయింది. దీంతో ఆ యువ‌కుడు పోలీసుల‌కు బార్బ‌ర్‌పై ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News