Telangana: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబంతో సహా వేంకటేశ్వరుడి దర్శనం
  • ఆలయ మర్యాదలతో స్వాగతం 
  • తిరుమలలో భక్తుల రద్దీ

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు, ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం, తీర్థప్రసాదాలను అందుకున్నారు. కాగా, వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే నిమిత్తం ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న మధ్యాహ్నం తిరుమలకు వచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది.

Telangana
indra karan reddy
  • Loading...

More Telugu News