Chandrababu: రాజమండ్రి మౌజిం హత్య కేసు గురించి డీజీపీతో మాట్లాడాను: సీఎం చంద్రబాబునాయడు

  • నిందితులను త్వరలోనే పట్టుకుని, కఠినంగా శిక్షిస్తాం
  • మృతుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు
  • విలేకరుల సమావేశంలో చంద్రబాబు

రాజమండ్రిలోని బత్తిననగర్ మసీదులో మౌజిం (చిన్న గురువు) మహ్మద్ ఫరూక్ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ సంఘటన గురించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ హత్య కేసు విషయమై ఇప్పటికే డీజీపీతో మాట్లాడానని చెప్పారు. హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

మృతుడికి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారని, మహ్మద్ ఫరూక్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారని, కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత కక్షలతో ఈ హత్య చేశారా? లేక రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలుతుందని చంద్రబాబు అన్నారు.

ఇప్పటికే క్లూస్ టీం రాజమండ్రి వెళ్లిందని, మృతుడి ఫోన్ కాల్స్ గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు. కాగా, మహ్మద్ ఫరూక్ మసీదులో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన తలపై కర్రలతో కొట్టి హత్య చేశారు.

  • Loading...

More Telugu News