lok sabha: లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ రామ్మోహన్!
- విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం బిల్లు
- 1989 రైల్వే చట్టానికి సవరణ చేయాలి
- రైల్వే జోన్ ఏర్పాటు అంశం విభజన చట్టంలోనూ ఉంది- రామ్మోహన్
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఈ రోజు లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లను కలిపి దీన్ని ఏర్పాటుచేయాలని అందులో పేర్కొన్నారు. ఇందు కోసం 1989 రైల్వే చట్టానికి సవరణ కోరుతున్నట్లు తెలిపారు.
రైల్వే జోన్ ఏర్పాటు అంశం విభజన చట్టంలోనూ ఉందని గుర్తు చేశారు. ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎంపీ రామ్మోహన్‌కు లోక్‌సభ స్పీకర్ ఆఫీస్ నుంచి సానుకూలంగా స్పందన రావడంతో ఈ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు.