ibc: ‘దివాలా’ చట్టానికి లోక్ సభ ఆమోదం

  • ఇటీవలే ఆర్డినెన్స్ ను తెచ్చిన కేంద్రం
  • దాని స్థానంలో లోక్ సభలో బిల్లు
  • రుణ ఎగవేతదారులు బిడ్డింగ్ లో పాల్గొనకుండా నిషేధం

దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణ బిల్లుకు లోక్ సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్యల పరిష్కారానికి ఐబీసీని కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. 2016 డిసెంబర్ లో ఇది తొలిగా అమల్లోకి వచ్చింది. అయితే, ఇందులో ఉన్న లోపాలను సవరిస్తూ ఇటీవలే ఆర్డినెన్స్ ను జారీ చేసిన కేంద్ర సర్కారు దాని స్థానంలో చట్టపరమైన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఇందులోని పలు సవరణల్లో కీలకమైనది... బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేని కంపెనీల ప్రమోటర్లు, తాము తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటే వాటిని సదరు ప్రమోటర్లు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు నిరోధిస్తుంది.

ibc
insolvency
  • Loading...

More Telugu News