mrps: మంద కృష్ణ పోరాడాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో!: కడియం శ్రీహరి

  • మంద కృష్ణ మాదిగపై మండిపడ్డ కడియం శ్రీహరి
  • ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలం
  • వర్గీకరణ కోసం అఖిలపక్షంతో కలిసి పోరాడేందుకు మేము సిద్ధం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్గీకరణ కోసం మంద కృష్ణ పోరాడాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని సూచించారు. కేబినెట్ లో ఎవరుండాలో తమకు మంద కృష్ణ చెప్పాల్సిన అవసరం లేదని, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం అఖిలపక్షంతో కలిసి కేంద్రప్రభుత్వంపై పోరాడేందుకు తాము సిద్ధమని, అందరం కలిసి ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని మంద కృష్ణకు సూచించారు. 

mrps
Kadiam Srihari
  • Loading...

More Telugu News