bank rates': బ్యాంకు డిపాజిట్లపై రేట్ల కోతకు అవకాశాలు తక్కువేనట!
- బ్యాంకులు అనుసరించకపోవచ్చు
- ద్రవ్య లభ్యత సానుకూలంగా లేకపోవడమే కారణం
- రేటింగ్స్ సంస్థ ఇక్రా అంచనా
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై 0.20 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు అనుసరించకపోవచ్చని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఇక్రా పేర్కొంది. ద్రవ్య లభ్యత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే కారణమని తెలిపింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ, బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించకపోవచ్చని భావిస్తున్నట్టు ఇక్రా పేర్కొంది. ద్రవ్య లభ్యత లోటును ఇందుకు కారణంగా పేర్కొంది. వ్యవస్థాపరంగా ద్రవ్య లభ్యతకు 2018 మార్చి వరకు కాస్తంత కటకటగానే ఉంటుందని తెలిపింది.