Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కారుకి అడ్డొచ్చినందుకు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ను కొట్టి.. డబ్బుతో పరారీ!

  • హార‌న్ కొడుతున్నా దారి ఎందుకు ఇవ్వ‌లేదంటూ దాడి
  • అబిడ్స్‌లో పోలీసుల‌కు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ ఫిర్యాదు
  • నిందితుల కోసం ఆరా

హైదరాబాద్‌లో న‌డిరోడ్డుపై కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయారు. న‌గ‌రంలోని అబిడ్స్‌లో వేగంగా కారు న‌డుపుతూ వ‌చ్చిన కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌మ వాహ‌నానికి అడ్డొచ్చిందంటూ ఓ ఆర్టీసీ బ‌స్సుని ఆపారు. తాము హార‌న్ కొడుతున్నా దారి ఎందుకు ఇవ్వ‌లేదంటూ ఆ బ‌స్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. అంతేకాదు, కండ‌క్ట‌ర్ వ‌ద్ద ఉన్న 9500 రూపాయ‌ల‌ను కూడా లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కండ‌క్ట‌ర్‌, డ్రైవ‌ర్ క‌లిసి అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News