Vijayawada: విజయవాడలో నేరప్రవృత్తి తగ్గింది!: సీపీ గౌతమ్ సవాంగ్

  • విజయవాడ కమిషనరేట్ లో 2017 నేర వార్షిక సమీక్ష నివేదిక విడుదల
  • రాజధాని ఏర్పాటుతో నగర ప్రజల ఆలోచనా విధానంలో మార్పు 
  • విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్

అమరావతి రాజధాని ఏర్పాటు అనంతరం విజయవాడలో నేరప్రవృత్తి తగ్గిందని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడ కమిషనరేట్ లో 2017 ఏడాది నేర వార్షిక సమీక్ష నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని ఏర్పాటుతో నగర ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలనేదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు.

గత ఏడాదితో పోల్చితే నగర కమిషనర్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని, నగరంలో సాంకేతికత వినియోగం పెంపు వల్ల పోలీసుల సామర్థ్యం పెరిగిందని, నేరాలు అదుపు చేయడంలో నగర ప్రజల సహకారం బాగుందని చెప్పారు. శాంతి భద్రతల సమస్య లేకుండా ఉంటేనే అన్ని విధాలా రాజధాని అభివృద్ధి సాధ్యమని, ఈ ప్రాంతంలో ప్రశాంతతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని, మహిళలపై వేధింపుల నివారణలో ‘రక్షక్’ బృందాలు మంచి ఫలితాలు సాధించాయని, ఈ ఏడాది 1860 మంది ఈవ్ టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చినట్టు గౌతమ్ సవాంగ్ తెలిపారు. 

  • Loading...

More Telugu News