co-operative banks: కో ఆప‌రేటివ్ బ్యాంకుల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుపై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌

  • అలాంటిదేమీ లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చిన ఆర్థిక‌మంత్రి
  • వాణిజ్య‌ బ్యాంకుల్లాగే ప‌నిచేస్తున్న‌ కో ఆప‌రేటివ్ బ్యాంకులు
  • లాభం పొంద‌ని సంస్థ‌ల‌కు మాత్ర‌మే మిన‌హాయింపు

ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి కోఆప‌రేటివ్ బ్యాంకుల‌ను మిన‌హాయిస్తున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. వాణిజ్య బ్యాంకుల్లాగే ప‌నిచేస్తూ, లాభాలు ఆర్జిస్తున్న కో ఆప‌రేటివ్ బ్యాంకుల‌కు ఎలాంటి మిన‌హాయింపు ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు ఆయ‌న లోక్‌స‌భ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు.

వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే కో ఆప‌రేటివ్ బ్యాంకులు కూడా క్రెడిట్‌ కార్డు, లాకర్లు, సేఫ్‌ డిపాజిట్‌ వాల్ట్‌లు, బ్యాంకు గ్యారెంటీ వంటి సేవల‌ను అందిస్తున్నాయి. లాభాల విష‌యంలో కూడా వాణిజ్య బ్యాంకుల‌కు పోటీనిస్తున్నాయి. లాభం పొందని సంస్థలకు మాత్రమే కేంద్రం పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తుంది. ప్రస్తుతం కో ఆపరేటివ్‌ బ్యాంకులకు, కమర్షియల్‌ బ్యాంకులకు ఎలాంటి తేడా లేదు. అందుకే వాటికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేద‌ని జైట్లీ చెప్పారు.

  • Loading...

More Telugu News