Nani: 'నానీ .. కాస్త దూకుడు తగ్గించవయ్యా' అంటున్నారట!

  • మిడిల్ క్లాస్ అబ్బాయ్'కి సక్సెస్ టాక్ 
  • నాని ఖాతాలోకి మరో హ్యాట్రిక్ హిట్ 
  • గట్టి పోటీలో నెక్స్ట్ మూవీతో బరిలోకి  

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' .. తొలి రోజున మిశ్రమ స్పందనను రాబట్టినప్పటికీ, భారీ వసూళ్లను సాధిస్తూ హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ ఏడాది కూడా నాని హ్యాట్రిక్ హిట్ ను పూర్తి చేశాడు. ఇక ఆయన తదుపరి చిత్రంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' రూపొందుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. దాంతో చాలామంది ఆశ్చర్యపోయారనే చెప్పాలి.

 ఎందుకంటే ఆ నెలలో రజనీ '2.0' .. మహేశ్ 'భరత్ అనే నేను'.. అల్లు అర్జున్ ' నా పేరు సూర్య' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ నెలలో '2.0' రిలీజ్ డేట్ ఖరారైన దానిని బట్టి తమ సినిమాల విడుదల తేదీలను ఫిక్స్ చేయాలని మహేశ్ .. బన్నీ సినిమాల దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటూ 'కృష్ణార్జున యుద్ధం' సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు. దాంతో కాస్త దూకుడు తగ్గించడం మంచిదని నానితో ఆయన సన్నిహితులు చెప్పినట్టుగా సమాచారం.   

  • Loading...

More Telugu News