Renu Desai: చలికాలంలో మంచు కొండల్లో రేణూ దేశాయ్... ఫొటో చూసి 'సూపర్ వదినా' అంటున్న పవన్ ఫ్యాన్స్!

  • కాశ్మీర్ లో గడ్డకట్టించే చలిలో రేణూదేశాయ్
  • ఉల్లాసంగా గడుపుతున్న నటి
  • 'ఖావా' తాగుతూ ఎంజాయ్
  • ఫేస్ బుక్ లో ఫొటోలు పెట్టిన రేణు

ప్రస్తుతం కాశ్మీర్ లో పర్యటిస్తున్న రేణూదేశాయ్, అక్కడ తాను ఉల్లాసంగా గడుపుతున్న చిత్రాలను ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కాశ్మీర్ స్వర్గంలా కనిపిస్తున్నదని చెబుతూ, శరీరాన్నంతా కప్పే కోటు, తలకు విగ్ క్యాప్ పెట్టుకుని, చేతులకు గ్లౌజస్ తో 'ఖావా' తాగుతూ కనిపించింది రేణూ దేశాయ్.

కాశ్మీరీ గ్రీన్ తేయాకు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు వంటి వాటిని కలుపుతూ, 'సమోవర్' అనే సంప్రదాయ ఫిల్టర్ లో తయారు చేసే 'ఖావా' ఎంతో రుచిగా ఉందని చెప్పింది. ఇందులో కలిపే పదార్థాలను బట్టి రుచి, సువాసన మారతాయని తెలిపింది. ఇక్కడ చాలా చలిగా ఉందని, ఆ చలిని కూడా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొంది. ఇక రేణూ దేశాయ్ పెట్టిన పోస్టుకు 'సూపర్ వదినా' అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి.

Renu Desai
Khawa
Kashmir
Cold
  • Error fetching data: Network response was not ok

More Telugu News