Rajanikant: కాలం కలిసి రావాలి... నా చేతుల్లో ఏముంది?: రజనీకాంత్

  • 1000 మంది అభిమానులతో రజనీకాంత్ సమావేశం
  • రాఘవేంద్ర కల్యాణ మండపంలో సాగుతున్న మీటింగ్
  • ఎంజీఆర్ ను ప్రస్తావించిన తలైవా

తాను రాజకీయాల్లోకి వచ్చే అంశం దేవుని ఆదేశమేనని, తన చేతుల్లో ఏమీ లేదని, కాలం కలిసి రావాల్సి వుందని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. నేడు వరుసగా నాలుగవ రోజు ఆయన తన అభిమానులతో రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశం అయ్యారు. కోయంబత్తూర్, ఈరోడ్, తిరుప్పూర్, వేలూరు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

తాను చేస్తానన్న ప్రకటనకు ఇంకా రెండు రోజులే గడువుందని ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకం చేశారు. నటుడైన ఎంజీఆర్ రాజకీయాల్లో నిబద్ధతతో రాణించారని గుర్తు చేశారు. "గతంలో ఎంజీఆర్ ఒక మాట చెప్పారు. దేనికైనా కాలం చాలా ముఖ్యమన్నారు. అవును... సూపర్ స్టార్లు, తెరమీద దేవుళ్లు ఇవన్నీ ముఖ్యం కాదు. దేనికైనా కాలం కలిసిరావాలి. తరం మారుతూ ఉంటుంది. సినిమా అయినా, రాజకీయాలైనా కాలమే సమాధానం చెబుతుంది" అంటూ తన రాజకీయ ప్రవేశంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

Rajanikant
Raghavendra kalyana mandapam
chennai
fans
  • Loading...

More Telugu News