delhi rape: న్యాయం కోసం వస్తే... మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోలీసు అధికారి!

  • వివాహ వివాదాన్ని పరిష్కరించాలంటూ పీఎస్ కు వచ్చిన మహిళ
  • న్యాయం చేస్తానంటూ ఫ్లాట్ కు పిలిపించుకున్న ఏఎస్ఐ
  • ఆపై అత్యాచారం

తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళపై సాక్షాత్తు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ అత్యాచారం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తన వివాహం విషయంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ ఓ మహిళ (30) ఢిల్లీలోని మియాన్ వాలీ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్ఐ దిలీప్ సింగ్ (50) సమస్యను పరిష్కరిస్తానంటూ ఆమెకు మాట ఇచ్చాడు.

తర్వాత సమస్య గురించి మాట్లాడదామంటూ బాధితురాలిని ఓ ఫ్లాటుకు రప్పించాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ దారుణంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫ్లాట్ కు వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అంతేకాదు, ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో కూడా నిరూపితమైంది. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ డీసీపీ ఎంఎన్ తివారీ మాట్లాడుతూ, ఏఎస్ఐ దిలీస్ సింగ్ ను డిస్మిస్ చేశామని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News