Pakistan: వాళ్లు ఆనందంగా మాట్లాడుకుంటే మీ గోలేంటి?: పాకిస్థాన్ ఆగ్రహం

  • భారత ఆరోపణలను తప్పుబట్టిన పాకిస్థాన్
  • ఆరోపణలు నిరాధారమని ప్రకటన విడుదల
  • వారు ఇంగ్లీషులో చక్కగా మాట్లాడుకున్నారు
  • సెక్యూరిటీ నిబంధనల మేరకే ఆభరణాలు తీయించామన్న పాక్

పాకిస్థాన్ లోని జైల్లో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్ ను గతవారం ఆయన భార్య, తల్లి కలిసిన వేళ, వారిని మాతృభాషలో మాట్లాడుకోనీయలేదని, భారత సంప్రదాయాలను కాలరాశారని ఇండియా చేసిన ఆరోపణలను పాక్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, భారత ఆరోపణలు నిరాధారమని, కావాలనే చేస్తున్నవని, వీటిని సహించబోమని పేర్కొంది. తాము మానవత్వంతో జాదవ్ భార్య, తల్లికి ఈ అవకాశం ఇచ్చామని, వారు దాదాపు 40 నిమిషాల సేపు ఆనందంగా మాట్లాడుకున్నారని, జాదవ్ మంచి ఇంగ్లీషులో భార్యతో మాట్లాడారని పేర్కొంది.

 జాదవ్ అన్న వ్యక్తి భారత ఉగ్రవాదని, గూఢచారని, పాకిస్థాన్ కు నష్టం కలిగించేందుకే వచ్చాడని మరోసారి పేర్కొంది. కాగా, కేవలం సెక్యూరిటీ నిబంధనల మేరకే వారు ధరించిన కొన్ని ఆభరణాలను తొలగించాలని కోరామని, జాదవ్ భార్య ధరించిన చెప్పుల్లో మెటల్ చిప్ ఉందని, దాన్ని విశ్లేషించిన తరువాత అదేమిటో చెబుతామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News