KCR: హైకోర్టుపై కేసీఆర్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు దీని కోసమే!: ఏపీ టీడీపీ కార్యదర్శి

  • ఏపీ హైకోర్టు నిర్మాణంపై పదేపదే వ్యాఖ్యలు
  • రాజకీయ లబ్ధి కోసమే
  • ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ పదేపదే ఏపీ హైకోర్టు నిర్మాణంపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఏపీలో హైకోర్టు బెంచ్ కావాలని టీడీపీ కోరుతోందని ఆయన గుర్తు చేశారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి, తద్వారా రాజకీయ లబ్ధిని పొందేందుకు టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వివేకంతో ఆలోచిస్తున్న లాయర్లందరూ ఏపీకి హైకోర్టు రావాలనే కోరుకుంటున్నారని చెప్పారు.

KCR
ap high court
gottipati ramakrishna
  • Loading...

More Telugu News