kurnool: కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు.. మరో నామినేషన్ తిరస్కరణ!

  • మొదలైన నామినేషన్ల తిరస్కరణ
  • ఇప్పటికే బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
  • తాజాగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ పర్వం మొదలైంది. ఇప్పటికే బీఎస్పీ అభ్యర్థి దండు శేషు యాదవ్ నామినేషన్ తిరస్కరించారు. తాజాగా, స్వతంత్ర అభ్యర్థి పులి జయప్రకాష్ రెడ్డి నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. అయితే, ఇతని నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారా? లేక ఆయనే ఉపసంహరించుకున్నారా? అనే అంశంలో క్లారిటీ లేదు. నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు చివరి రోజు కావడం గమనార్హం. మరోవైపు, ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

kurnool
kurnool mlc elections
  • Loading...

More Telugu News