china rajappa: అలకపాన్పు ఎక్కిన హోంమంత్రి చినరాజప్ప!

  • ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపనకు డుమ్మా
  • కానిస్టేబుల్ తో ఆహ్వానం పంపడమే కారణం
  • అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

ఏపీ హోంమంత్రి చినరాజప్ప తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీనికంతటికీ కారణం ఓ కానిస్టేబుల్ తో తనకు ఆహ్వాన పత్రిక పంపడమే. దీంతో, ఆయన మనోవేదనకు గురయ్యారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకాకుండా కుటుంబసమేతంగా తిరుపతి వెళ్లిపోయారు. కార్యక్రమానికి చినరాజప్ప హజరుకాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. విషయం తెలుసుకున్న ఆయన... అధికారులు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

శంకుస్థాపన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచ శ్రేణి రాష్ట్రంగా అవతరించనున్న ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పూర్తిగా నియంత్రించాలని అన్నారు. నేర నియంత్రణకు లేబరేటరీలు దోహదం చేస్తాయనే లక్ష్యంతోనే తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి నేడు శంకుస్థాపన చేశామని తెలిపారు. త్వరలో నిర్మాణం పూర్తి చేసి వరల్డ్ బెస్ట్ ల్యాబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

china rajappa
ap home minister
Chandrababu
  • Loading...

More Telugu News