talaq: ఆలస్యంగా నిద్రలేచిన భార్య.. తలాక్ చెప్పి ఇంట్లోంచి గెంటేసిన భర్త

  • ఉత్తరప్రదేశ్, రాంపూర్‌లో ఘటన
  • రాత్రిపూట మద్యం తాగి వచ్చి భర్త కొట్టాడని మహిళ ఫిర్యాదు 
  • అందుకే ఒంటి నొప్పులతో కొద్దిసేపు ఎక్కువగా పడుకున్నానని వివరణ

ఆలస్యంగా నిద్రలేచిందని తన భార్యకు తలాక్ చెప్పేశాడు ఓ భర్త. ఉత్తర ప్రదేశ్ రాంపూర్‌లోని అజీంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నిన్న ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేవడంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆమె భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. తలాక్ చెప్పేశానని ఇక తన వద్దకు రావద్దని కుండ బద్దలు కొట్టాడు.

దీంతో ఆ ముస్లిం మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపి విలపించింది. తన భర్త మద్యం తాగి వచ్చి రాత్రి తనను కొట్టాడని, దీంతో ఒంటి నొప్పులతో బాధపడుతూ కాస్త అధికంగా నిద్రపోయానని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తలాక్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించినప్పటికీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం గమనార్హం.       

  • Loading...

More Telugu News