Hyderabad: 31న హైదరాబాద్ లోని అన్ని ఫ్లైఓవర్లు బంద్: సీపీ సందీప్ శాండిల్య

  • 31న హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సహా అన్ని ఫ్లై ఓవర్లు బంద్
  • డ్రంకెన్ డ్రైవ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
  • అతి వేగంతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్న సీపీ  

ఈ నెల 31న హైదారాబాద్ లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తామని అన్నారు.

31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకే సెలెబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతిస్తామని, డ్రంకెన్ డ్రైవ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, అతి వేగంతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మొత్తం 120 బృందాలను బ్రీత్ అనలైజర్లతో రంగంలోకి దింపుతామని తెలిపారు. 

Hyderabad
cyberabad
  • Loading...

More Telugu News