arrested: ప్రియుడితో కలసి.. పెంపుడు త‌ల్లిని హ‌త‌మార్చిన ఏడో త‌ర‌గ‌తి బాలిక‌!

  • ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణం
  • 15 ఏళ్ల‌ స్నేహితుడి సాయంతో హ‌త్య‌
  • ఆ త‌రువాత డ్రామా ఆడిన వైనం
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌తేపూర్‌లో ఘ‌ట‌న‌

ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతోన్న ఓ బాలిక త‌న స్నేహితుడితో క‌లిసి దారుణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌తేపూర్‌లో చోటు చేసుకుంది. అమ్మానాన్న‌లు, బంధువులు లేని స‌ద‌రు బాలికను మూడు నెల‌ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు.. అనాథశ్రమం నుంచి ఓ మ‌హిళ ద‌త్త‌త తీసుకుంది. ఇప్పుడు ఆ బాలికకు 12 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చింది. త‌న‌ను కంటికి రెప్పలా చూసుకుంటోన్న ఆ మహిళను ఆ బాలికే హ‌త్య చేయించింది. అందుకు కార‌ణం ఆ బాలిక ఇంత చిన్న వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డ‌డ‌మే.. ఆ బాలిక త‌న‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడి ప్రేమిస్తోంది.

ఈ విష‌యం ఆమె పెంపుడు త‌ల్లికి తెలియ‌డంతో ప్రేమగీమ వద్దంటూ హెచ్చ‌రించింది. దీంతో త‌న పెంపుడు త‌ల్లిపై ఆగ్ర‌హం తెచ్చుకున్న ఆ బాలిక తన స్నేహితుడిని రాత్రి స‌మ‌యంలో ఇంటికి పిలిపించి, అతడితో కలిసి గొంతు నులిమి హతమార్చింది. అనంత‌రం త‌న‌ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, స్పృహ త‌ప్పి ప‌డిపోయింద‌ని అంద‌రినీ న‌మ్మించింది. వైద్యుడు ఆ ఇంటికి వ‌చ్చి అప్పటికే ఆమె మృతి చెందింద‌ని చెప్పి వెళ్లిపోయాడు.

అయితే, అంత్యక్రియలు జరిపే స‌మ‌యంలో మృత‌దేహం గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికుల‌కు అనుమానం క‌లిగింది. దీంతో పోలీసులు ఆ బాలిక‌ను విచారించ‌గా అస‌లు విష‌యాన్ని తెలిపింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌నూ అరెస్టు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించి ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News