sudheer babu: యంగ్ హీరో సినిమాకి 'సమ్మోహనం' టైటిల్ ఖరారు

  • మోహనకృష్ణ ఇంద్రగంటితో సుధీర్ బాబు 
  • కథానాయికగా అదితీ రావు 
  • హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్

విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మోహనకృష్ణ ఇంద్రగంటి సొంతం చేసుకున్నారు. 'అష్టాచమ్మా' .. 'జెంటిల్ మెన్' .. ' అమీ తుమీ' చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పడుతుంటాయి. తాజాగా ఆయన సుధీర్ బాబు కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా అదితీరావును తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకి 'సమ్మోహనం' అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా, డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతోందట. ఈ సినిమా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో సుధీర్ బాబు వున్నాడు.      

  • Loading...

More Telugu News