Priyanka Chopra: ఇప్పటికి పెళ్లిపై ఆశ పుడుతోంది... వరుడు దొరకడం కష్టమేనేమో!: ప్రియాంకా చోప్రా

  • ఓ ఈవెంట్ లో పెళ్లి ప్రస్తావన
  • వివాహం చేసుకోవాలని ఉందన్న ప్రియాంక
  • కష్టాన్ని గుర్తించిన వ్యక్తిని చేసుకుంటానని వెల్లడి
  • 35 ఏళ్ల వయసులో ప్రియాంకకు పెళ్లి ఆలోచన

బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రాకు ఇప్పటికి పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె, పెళ్లి ప్రస్తావన వచ్చిన వేళ స్పందించింది. తనకు తగిన వరుడు దొరకడం కష్టమైన పనే అనిపిస్తోందని కూడా చెప్పింది. కచ్చితంగా తనకిప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉందని, అయితే, తన వృత్తిని గౌరవిస్తూ, ఇప్పటివరకూ చేసిన కష్టాన్ని గుర్తించి, అభినందించే మనసున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, ఇది తన తల్లి నుంచి తనకు లభించిన సలహా అని పేర్కొంది.

ప్రస్తుతం క్వాంటికో మూడో పార్టులో నటిస్తున్న ప్రియాంక, 1982, జూలై 18న జన్మించింది. అంటే, ఇప్పుడామె వయసు 35 సంవత్సరాలు దాటినట్టు. ఇంతకాలానికి ప్రియాంకకు పెళ్లి మీద మనసైందన్నమాట. ఇక వరుడెవరో? ఎక్కడున్నాడో? ఎప్పుడు దొరుకుతాడో?

Priyanka Chopra
Marriage
  • Loading...

More Telugu News