raghuveera reddy: ఈ పని చేస్తే టీడీపీకే మద్దతు పలుకుతా.. కాంగ్రెస్ తరఫున నామినేషన్ కూడా వేయను!: రఘువీరారెడ్డి ఆఫర్

  • కళ్యాణదుర్గం ప్రాంతంలోని చెరువులకు నీరందించండి
  • కాంగ్రెస్ తరపున పోటీ పెట్టం
  • ఇంకా 14 నెలల సమయం ఉంది

2019 ఎన్నికల్లోగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ నీటిని అందిస్తే కాంగ్రెస్ పార్టీ తరపున తాను కనీసం నామినేషన్ కూడా వేయబోనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఎన్నికల్లో టీడీపీకే మద్దతు పలుకుతానని చెప్పారు. 'ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కళ్యాణదుర్గం ప్రాంతంలోని చెరువులకు నీరందిస్తామని ఏడాది క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని... ఇంతవరకు అది నెరవేర్చలేదని చెప్పారు. ఇంకా 14 నెలల పాలన ఉందని... ఈలోగా నీరు అందిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా వేయబోదని అన్నారు. జనవరి 2 నుంచి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, గత జన్మభూమి కార్యక్రమాల్లో తీసుకున్న అర్జీలు, వాటి పరిష్కారాలను తెలియజేయాలని డిమాండ్ చేశారు. 

raghuveera reddy
Chandrababu
kalyanadurgam constituency
  • Loading...

More Telugu News