Aishwarya Rai: ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న ఐశ్వ‌ర్యరాయ్‌

  • మార్చిలో ప్రారంభం కానున్న షూటింగ్‌
  • థ్రిల్ల‌ర్ క‌థాంశంగా తెర‌కెక్క‌నున్న చిత్రం
  • స్ప‌ష్టం చేసిన నిర్మాత ప్రేర‌ణ అరోరా

ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ తమ తదుప‌రి చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతోంద‌ని బాలీవుడ్ నిర్మాత ప్రేర‌ణ అరోరా వెల్ల‌డించారు. ఐశ్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న 'ఫ్యానీ ఖాన్' చిత్రానికి ప్రేర‌ణ నిర్మాత‌. ఐశ్ త‌దుప‌రి చిత్రానికి కూడా తానే నిర్మాత‌న‌ని, ఈ చిత్రంలో ఐశ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతోంద‌ని, థ్రిల్ల‌ర్ క‌థాంశంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని ప్రేర‌ణ తెలిపారు.

వ‌చ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆమె చెప్పారు. యూర‌ప్‌లోని కొన్ని లొకేష‌న్ల‌లో ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో న‌టించ‌బోయే హీరో ఎవ‌రనే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. 'ఫ్యానీ ఖాన్' చిత్రాన్ని రంజాన్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News