actress hari teja: భర్త గురించి వివరాలను తెలిపిన నటి, యాంకర్ హరి తేజ!

  • బెంగుళూరులో సీనియర్ సైంటిస్ట్ గా పని చేస్తున్నారు
  • ఆయన వైపు నుంచి అరేంజ్డ్ మ్యారేజ్.. నా వైపు నుంచి లవ్ మ్యారేజ్
  • షూటింగులు లేనప్పుడు బెంగుళూరు వెళ్తా

సినీ నటిగా, యాంకర్ గా హరితేజ ఎంతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత హరితేజ క్రేజ్ మరింత పెరిగింది. ఆఫర్లు కూడా భారీగా పెరిగాయి. ఈ సందర్భంగా, హెచ్ఎంటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన భర్తకు సంబంధించిన వివరాలను ను వెల్లడించింది.

తన భర్త దీపక్ బెంగుళూరులో ఉంటారని... సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారని తెలిపింది. ఆయన వైపు నుంచి తమది అరేంజ్డ్ మ్యారేజ్ అని, తన వైపు నుంచి లవ్ మ్యారేజ్ అని చెప్పింది. ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తన భర్త తనతో సరదాగా అంటుంటారని తెలిపింది.  తనకు షూటింగులు లేనప్పుడు బెంగుళూరు వెళతానని... షూటింగ్ ఉందని ఫోన్ రాగానే పెట్టేబేడా సర్దుకుని తిరిగి వస్తానని చెప్పింది.

actress hari teja
hari teja husband
  • Loading...

More Telugu News