Jagan: జగన్ ను ముద్దాడేందుకు ఎగిరి దుమికిన మహిళ!

  • ప్రజా సంకల్ప యాత్రలో ఆసక్తికర ఘటన
  • జగన్ కోసం సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని వచ్చిన మహిళ
  • అడ్డుకున్న సెక్యూరిటీ - వారించిన జగన్

అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్పీ కుంట మండలంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ 'ప్రజా సంకల్ప యాత్ర' జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ మహిళ జగన్ ను చూసిన ఆనందంలో ఆయన్ను హత్తుకుని ముద్దాడాలని సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని మరీ జగన్ మీదకు దుమికింది.

అయితే, వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పక్కకు లాగబోయారు. వారిని సుతారంగా వారించిన జగన్, ఆమెను దగ్గరకు పిలిచి పలకరించారు. కుశల ప్రశ్నలు అడిగారు. తమ అభిమాన నేత జగన్ తో మాట్లాడానన్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది. కాగా, నేడు వైఎస్ జగన్ పాదయాత్ర 46వ రోజు కొనసాగుతోంది.

Jagan
Lady
Praja Sankalpa Yatra
  • Loading...

More Telugu News